current affairs telugu

డైలీ తెలుగు కరెంట్ అఫైర్స్ 09/03/2023

తెలుగు కరెంట్ అఫైర్స్ 09/03/2023 – www.telugueducation.in

  • నేపాల్ 3వ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు
  • దేశ అధ్యక్ష ఎన్నికలలో నేపాల్ రాజకీయ నాయకుడు రామ్ చంద్ర పౌడెల్ విజయం సాధించారు. 2008లో నేపాల్ రిపబ్లిక్గా అవతరించిన తర్వాత ఈసారి ఇది మూడో ఎన్నికలు.
  • 550 మంది అసెంబ్లీ సభ్యుల్లో 518 మంది, 332 మంది ఎంపీల్లో 313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేల్లో 352 మంది, ఎంపీల్లో 214 మంది పౌడెల్‌కు ఓటు వేశారు. మాజీ ప్రధాని కె.పి.శర్మ నేతృత్వంలోని సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాష్‌ చంద్ర నెబ్‌మాంగ్‌ ఓడిపోయారు. ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ పదవీ కాలం మార్చి 12తో ముగియనుంది.
  • SDNY జిల్లా న్యాయమూర్తిగా అరుణ్ సుబ్రమణియన్ నియమితులయ్యారు

భారతీయ-అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బిడెన్చే ఎన్నికయ్యారు. అతను గతంలో న్యూయార్క్లో అటార్నీగా పనిచేశాడు.

  • గ్రీన్హౌస్ వాయువులను అదుపుతెచ్చేందుకు డెన్మార్క్లో సరికొత్త ప్రాజెక్టు

భూతాపానికి కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువులను అదుపులోకి తీసుకొచ్చేందుకు డెన్మార్క్ ప్రభుత్వం వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వాతావరణంలోకి అధిక మొత్తంలో చేరే కార్బన్ డైఆక్సైడ్ను సమీకరించి దానిని సముద్ర భూతలం అడుగున పాతిపెట్టే క్రతువును ప్రారంభించింది. తద్వారా పారిశ్రామిక యుగం ముందు నాటితో పోల్చితే భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం సాకారానికి తన వంతు తోడ్పాటునివ్వాలని నిర్ణయించింది. ‘ప్రాజెక్టు గ్రీన్శాండ్’గా దీనికి నామకరణం చేసింది.

  • మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4 శాతమే!

ఈ ఆర్థిక సంవత్సరం (2022 – 23) నాలుగో త్రైమాసికంలో (జనవరి – మార్చి) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 4 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి దేశ జీడీపీ వృద్ధి రేటు, ప్రభుత్వ అంచనా అయిన 7% కంటే తక్కువగా నమోదు కావొచ్చని పేర్కొంది.

యునైటెడ్ కింగ్డమ్ ఏ సంస్థతో ‘విండ్సర్ ఫ్రేమ్వర్క్’పై సంతకం చేసింది?

[A] ISA

[B] EU

[C] G-20

[D] G-7

Ans : B

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!