జూన్ టాప్ కరెంటు అఫైర్స్ బిట్స్ – June Top Current Affairs 2020 in telugu
1వ ప్రశ్న: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?
సమాధానం : ఉదయ్ కోటక్
2వ ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్) రూపొందించిన ‘టీఎస్ వెదర్’ మొబైల్ యాప్‌ను ఎవరు ఆవిష్కరించారు ?
సమాధానం : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్
NTPC లో 275 పోస్టులు – NTPC 275 jOBS
3వ ప్రశ్న: దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం భారత ప్రభుత్వం ఏ రోజు నిషేధం విధించింది ?
సమాధానం : జూన్ 29న
4వ ప్రశ్న: ‘సీ ఓటర్-ఐఏఎన్‌ఎస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఎవరికీ ప్రథమ స్థానం లభించింది.?
సమాధానం : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు
5వ ప్రశ్న: దేశంలోనే తొలిసారిగా ఏ ఐఐటి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది ?
సమాధానం : ఐఐటీ మద్రాస్
6వ ప్రశ్న: కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల పనులకు దూరమైన వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రోజున ప్రారంభించారు.?
సమాధానం : జూన్ 20న
7వ ప్రశ్న: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎవరిని నియమిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు?
సమాధానం : ఎ.పరమేశం
8వ ప్రశ్న: ‘నరేంద్ర మోదీ- హార్బింజర్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ అపొసిల్ ఆఫ్ వరల్డ్ పీస్’ అనే ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు.
సమాధానం : సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ బాలకృష్ణన్
9వ ప్రశ్న: తూర్పు నావికాదళం (ఈఎన్‌సీ) ప్రధాన కార్యాలయం అయిన ఐఎన్‌ఎస్ సర్కార్ నూతన కమాండింగ్ ఆఫీసర్‌గా ఎవరు మే 30న పదవీ బాధ్యతలు స్వీకరించారు.?
సమాధానం : రాహుల్ విలాస్ గోఖలే
AP NET Non Teaching Staff Notification – నిట్ ఆంధ్రప్రదేశ్ లో నాన్ టీచింగ్ పోస్టులు
10వ ప్రశ్న: పీచుతీసిన ముదురు కొబ్బరికాయకు కనీస మద్దతు ధరను ఎంత శాతానికిపైగా పెంచినట్టు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జూన్ 23న తెలిపారు ?
సమాధానం : 5 శాతం
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ హిస్టరీ బిట్స్ – AP & Telangana History Bits