వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 150
ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్‌లు–50, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–100.

డిప్లొమా అప్రెంటిస్‌లు:
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్‌/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి.
స్టయిపెండ్‌ నెలకు రూ.3542 చెల్లిస్తారు.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు:
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
స్టయిపెండ్‌ నెలకు రూ.4984 చెల్లిస్తారు.
2019, 2020, 2021లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం: డిప్లొమా/ఇంజనీరింగ్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చే స్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:18.11.2021

వెబ్‌సైట్‌: https://www.vizagsteel.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *