డైలీ తెలుగు కరెంట్ అఫైర్స్ 06/03/2023
- ఇరానీ కప్ టైటిల్ విజేత గా ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’
‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ జట్టు మధ్యప్రదేశ్ను ఓడించి ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్పై విజయం సాధించింది. 437 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు మొత్తం 58.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఈ ఫైనల్ మ్యాచ్ గ్వాలియర్లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో జరిగింది. 2022-23 ఎడిషన్ ఇరానీ కప్ యొక్క 59వ ఎడిషన్.
- త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా
త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్ సాహా ఎంపికయ్యారు. భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి ప్రతిభా భౌమిక్ పేరు తెరపైకి వచ్చినా చివరకు సాహాకే పదవి దక్కింది. ఆయన మార్చి 8వ తేదీన ప్రమాణం చేయనున్నారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా 32 సీట్లను గెలుచుకుంది.
- ప్రపంచంలోనే మొదటి వెదురు బారియర్
ప్రపంచంలోనే మొదటి వెదురు బారియర్ను మహారాష్ట్రలోని ఓ జాతీయ రహదారిపై ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రపుర్, యవత్మాల్ జిల్లాలను కలిపే హైవేపై వాణీ – వరోరా పట్టణాల మధ్య 200 మీటర్ల మేర ఈ వెదురు క్రాష్ బారియర్ను ఉంచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ వెదురు బారియర్కు ‘బాహుబలి’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ‘బాంబూసా బాల్కోవా’ వెదురు జాతితో వీటిని తయారు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
- వార్తల్లో కనిపించిన ‘సమర్త్ పథకం’ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది?
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 థీమ్ ఏమిటి?
ఎ) #సమానం కోసం ప్రతి
బి) #సవాల్‌ని ఎంచుకోండి
సి) #ఈక్విటీని స్వీకరించండి
డి) #ప్రగతి కోసం నొక్కండి
Ans : C