డైలీ తెలుగు కరెంట్ అఫైర్స్ 23/01/2023
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి
- దేశంలోని ప్రజలను, ముఖ్యంగా యువతను ఉత్తేజపరిచేందుకు ప్రతి సంవత్సరం జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటారు.
- అతను జనవరి 23, 1897 న ఒడిశాలోని కటక్‌లో జన్మించాడు మరియు అతని పుట్టినరోజును 2022 నుండి ‘పరాక్రమ్ దివస్’ (శౌర్య దినం)గా జరుపుకుంటున్నారు.
- 1923లో అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై 1938లో హరిపుర కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
నేవీలో చేరిన ఐఎన్‌ఎస్ వాగీర్
- కల్వరీ తరగతికి చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాగీర్ భారత నేవీలో అధికారికంగా చేరింది.
- ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- ‘ప్రాజెక్ట్ 75’లో భాగంగా స్కార్పియన్ సాంకేతికతతో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఐఎన్‌ఎస్ వాగీర్‌ను నిర్మించింది. దీని కోసం ఫ్రాన్స్ నావల్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
నిజాం వారసుడిగా అజ్మత్ జా
- హైదరాబాద్ నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు.
- ప్రిన్స్ ముకర్రమ్ జా మృతి అనంతరం ఆయన వారసుడిగా అజ్మత్ జాను ఎంపిక చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు.
- కుటుంబ సభ్యులు, సన్నిహితులు, నిజాం ట్రస్టీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.