ఎపిపిఎస్సి గ్రూప్ 4 కంప్యూటర్ టెస్ట్ ఎలా ఉంటుంది ?
ఎపిపిఎస్సి గ్రూప్ 4 కంప్యూటర్ టెస్ట్ ఎలా ఉంటుంది ?
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
ఉన్న ఖాళీలను బట్టి 1:2 నిష్పత్తిలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ‘స్క్రీనింగ్‌లో అర్హత సాధించి, మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించినప్పుడే కదా.. కంప్యూటర్ టెస్ట్‌కు హాజరయ్యేది!’ అనే భావన చాలామంది అభ్యర్థుల్లో ఉంది. సిలబస్‌లో ఇచ్చిన అంశాలను పరిశీలిస్తే ప్రధానంగా ఎమ్మెస్ ఆఫీస్‌పై గట్టి పట్టు ఉండాలి. ఎమ్మెస్ వర్డ్, ఎక్సెల్ పవర్ పాయింట్‌లతోపాటు ఎంఎస్ యాక్సెస్ అవగాహన కూడా అవసరం. ఎంఎస్ యాక్సెస్ అని స్పష్టంగా చెప్పకపోయినా డేటాబేస్ మేనేజ్‌మెంట్‌లో కూడా ప్రశ్నలు వస్తాయని చెప్పారు కాబట్టి యాక్సెస్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎమ్మెస్ ఆఫీస్‌పై ప్రశ్నలు మౌలిక స్థాయిలో ఉండవచ్చు. ప్రధానంగా ప్రాక్టీస్ ఆధారిత ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున సాధన ఇప్పటినుంచే ప్రయత్నిస్తే మంచిది.
వర్డ్, ఎక్సెల్, ఇతరత్రా అంశాల్లో కూడా ఏ ఉప అంశాలను పరీక్ష పరిధిలోకి తీసుకున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. వాటిని ప్రాక్టీసుతో నేర్చుకుంటే ప్రయోజనకరం. కంప్యూటర్ పరీక్షకు ఎంపికైన తర్వాత ఎమ్మెస్ ఆఫీస్ సంగతి చూడొచ్చులే అనే నిర్లిప్త ధోరణి మంచిది కాదు. వివిధ బ్రౌజర్‌లను ఉపయోగించి సమాచారాన్ని వెతకటం, కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం, ఈ-మెయిల్ రూపకల్పన, వినియోగం, ఈ కామర్స్ వ్యవహారాలు.. ఇలాంటివి కూడా సిలబస్‌లో ఉన్నాయి. వాటి గురించి ప్రాథమిక పరిజ్ఞానం పెంచుకుంటే మంచిది.
APPSC Group 4 (2021) Free Study Material PDF Files
APPSC Group 4 Free Online Test >> Clich Here