ఇండియన్ ఎకానమీ బిట్స్ – Indian Economy bits 2020
ఇండియన్ ఎకానమీ బిట్స్
Indian Economy bits 2020
1.సప్లై తనంతట తానే డిమాండ్ ను సృష్టించుకుంటుంది అని చెప్పింది ఎవరు?
సమాధానం : J.B.సెయ్
2.సంప్రదాయ అర్థ శాస్త్రం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ?
సమాధానం : కారల్ మార్క్స్
3.సంప్రదాయవాదుల ప్రకారం ధరల స్థాయి సప్లైకి, చలామణి వేగానికి ఉండే సంబంధం ఏది?
సమాధానం : ధనాత్మకం
4.వేతన కొత్త విధానం సూచించిన ఆర్థికవేత్త ?
సమాధానం : పిగూ
5.సంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం పొదుపు దీనిపై ఆధారపడుతుంది ?
సమాధానం : వడ్డీ రేటు
6.అతిపెద్ద ఆర్థిక మాంద్యం ఏర్పడిన సంవత్సరం ?
సమాధానం : 1930
7.’జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ’ రచయిత ఎవరు?
సమాధానం : J.M కిన్స్
8. మొత్తం వస్తు రాశికి సమానంగా ఉన్న డిమాండ్ ను ఏమంటారు?
సమాధానం : సార్థిక డిమాండు
9.MEC అనే భావనను ప్రతిపాదించినవారు?
సమాధానం : కిన్స్
10. పెట్టుబడి పెరుగుతూ ఉంటే మూలధన సామర్థ్యం?
సమాధానం : తగ్గుతుంది
11.ప్రాథమిక మానసిక వినియోగాల సూత్రాన్ని వివరించిన వారు?
సమాధానం : కిన్స్
12.అర్థశాస్త్రంలో ప్రదర్శన ప్రభావాన్ని వివరించిన వారు?
సమాధానం : డ్యూసెన్ బెర్రి
13. వినియోగం/ఆదాయం అంటే ?
సమాధానం : ఉపాంత వినియోగ ప్రవృత్తి