current affairs telugu

June Month Telugu Current Affairs 2020 MCQ’S

June Month Telugu Current Affairs 2020 MCQ’S

1. ఇన్ఫ్లూయెంజా వంటి అనారోగ్యాలను (ILI) కలిగిన రోగుల రక్త ఆక్సిజన్ స్థాయిలను, హృదయ స్పందన రేటును పర్యవేక్షించడానికి “ప్రాణవాయు” అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం?

1) హైదరాబాద్
2) చెన్నై
3) బెంగళూరు
4) విశాఖపట్నం
Ans : 3

2. “సబ్నేషనల్ మ్యాపింగ్ ఆఫ్ అండర్-5 అండ్ నియోనేటల్ మోర్టాలిటీ ట్రెండ్స్ ఇన్ ఇండియా: ది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2000–17” ప్రకారం 2017లో అత్యధికంగా ఐదేళ్ల లోపు, నవజాత శిశువుల మరణాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?

1) బిహార్
2) హర్యానా
3) ఉత్తర ప్రదేశ్
4) ఒడిశా
Ans : 3


3. దేశంలో డైరెక్ట్-టు-బ్యాంక్ డిపాజిట్ల కోసం మనీగ్రామ్ చెల్లింపు వ్యవస్థతో ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉంది?

1) ఇండస్ఇండ్ బ్యాంక్
2) యూకో బ్యాంక్
3) ఫెడరల్ బ్యాంక్
4) యాక్సిస్ బ్యాంక్
Ans : 3
4. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు?

1) వి. విద్యావతి
2) అనురాగ్ జైన్
3) అనితా కార్వాల్
4) కటికితల శ్రీనివాస్
Ans : 1

5. 2021 ఫిబ్రవరిలో ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

1) భారత్
2) దక్షిణాఫ్రికా
3) అర్జెంటీనా
4) స్పెయిన్
Ans : 1

6. COVID-19 మహమ్మారిపై పోరాడటానికి PM CARES ఫండ్ ట్రస్ట్ నుంచి కేటాయించిన మొత్తం ఎంత?

1) రూ. 1500 కోట్లు
2) రూ. 3100 కోట్లు
3) రూ. 2000 కోట్లు
4) రూ. 2500 కోట్లు
Ans : 2

7. FIDE Chess.com ఆన్లైన్ నేషన్స్ కప్ 2020 మొదటి ఎడిషన్ను గెలుచుకున్న దేశం ఏది?

1) రష్యా
2) చైనా
3) సెర్బియా
4) ఉక్రెయిన్
Ans : 2




8. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఆన్లైన్ ఎడ్యుకేషన్(1 నుంచి 12 వరకు) కోసం ప్రారంభించిన పథకం?

1) పీఎం ఇ-సురక్ష
2) పీఎం ఇ-అభియాన్
3) పీఎం ఇ-విద్యా
4) పీఎం ఇ-కళ్యాణ్
Ans : 3

9. అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని ఏటా యునెస్కో ఎప్పుడు నిర్వహిస్తుంది? (1960లో థియోడర్ మైమాన్ విజయవంతంగా నిర్వహించిన మొదటి లేజర్ ఆపరేషన్ వార్షికోత్సవం)

1) మే 14
2) మే 20
3) మే 18
4) మే 16
Ans : 4




10. జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కింద డిసెంబర్ 2022 నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు నీటిని సరఫరా చేయడానికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ప్రణాళిక వేసింది?

1) పుదుచ్చేరి & తమిళనాడు
2) ఛత్తీస్గఢ్ & హర్యానా
3) జమ్మూ & కాశ్మీర్ & హర్యానా
4) జమ్మూ & కాశ్మీర్ & లఢఖ్
Ans : 3


11. ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ ట్రేడింగ్ పోర్టల్కు చెందిన ఇ-నామ్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేసిన మొత్తం మండీల సంఖ్య ఎంత? (మే 15, 2020 నాటికి)

1) 1000
2) 1500
3) 1200
4) 900
Ans : 1

12. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) కమ్యూనికేషన్ టెక్నాలజీని పరీక్షించడానికి జిన్యున్-2 01, 02 అనే రెండు ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది?

1) థాయిలాండ్
2) దక్షిణ కొరియా
3) జపాన్
4) చైనా
Ans : 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!